అమెరికా సామ్రాజ్యవాద ఒత్తిళ్లకు తలొగ్గి పత్తి దిగుమతిపై సుంకాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల నాలుగున కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయనున్నట్లు ఎస్ కెఎం నాయకులు తెలిపారు. వామపక్ష రైతు సంఘాల సంయుక్త సమావేశం మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పత్తిపై సుంకాన్ని రద్దు చేయడం ద్వారా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఎదురవుతుందన్నారు. మోడీ రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారూ