నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు–కుంటాల రహదారి అందకూర్ గ్రామం వద్ద వరదల కారణంగా రోడ్డుకు కోతకు గురైంది. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో రోడ్డు ఒక వైపు దెబ్బతింది. ఈ మార్గం గుండా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎగువ ప్రాంతం నుంచి మరింత వరద వస్తే రోడ్డు పూర్తిగా దెబ్బతినే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు కుంటాల మండల వ్యాప్తంగా అంతటా అతలాకుతలమైంది. వరద నీటి ఉధృతి కారణంగా వెంకూరు గ్రామంలోని పలువురు రైతుల పంట భూముల్లో ఇసుక మ