ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో పాటు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ బుధవారం మధ్యాహ్నం ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి వాగు ప్రదేశాన్ని పరిశీలించారు.ASF జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, కావున కాలి నడకన, వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని తెలిపారు.