మే నెలలో హైదరాబాదులో జరగనున్న ప్రపంచ సుందరీమణుల పోటీలను రద్దు చేయాలని కోరుతూ, నెల్లికుదురు తహసిల్దార్ కు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పగిడి పాల తిరుపతక్క ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. స్త్రీ ని అంగడి సరుకుగా,కొలతలతో,అర్ధనగ్న ప్రదర్శన చేయించడం ప్రజాస్వామ్య వ్యవస్థలను అవమానించడమేనని అన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలు ముక్తకంఠంతో మిస్ వరల్డ్ పోటీలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.