గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులు నిరుపేద రోగుల సేవలో పునీతం కావాలని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పిలుపునిచ్చారు. నందిగామ డివిజన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న వైద్యుల సంక్షేమ సమావేశం ఆదివారం ఉదయం 11 గంటలకు నందిగామలో జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీరామ్ రాజగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.