ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం కూలిన ఘటనతో ఉద్యోగులు భయపడుతున్నారు. మొదటి అంతస్తులోని ఏ, బీ సెక్షన్ల పైకప్పు, ట్రెజరీ కార్యాలయ పిల్లర్లు కూలిపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లోనే విధులు నిర్వహిస్తున్నారు. భవనంపై అంతస్తుకు వెళ్లకుండా అధికారులు గేటుకు తాళం వేశారు. మిగతా భవనం కూడా ఎప్పుడు కూలుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.