ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు యలమందపై జరిగిన దాడికి సంబంధించిన సిసి ఫుటేజ్ ను పోలీసులు మంగళవారం విడుదల చేశారు. సోమవారం బిజెపి నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అకారణంగా తమ పార్టీ నేతపై దాడి చేశారని ఆ దాడి అనంతరం కావాలని పోలీసులు మరలా దాడి చేశారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అసలు ఏం జరిగింది గొడవ ముందుగా ఎవరు చేశారు గొడవకు గల ప్రధాన కారణం ఏంటి అనే వివరాలను తెలియజేసే సిసి ఫుటేజ్ ను ఎస్ఐ విడుదల చేశాడు ఈ ఫుటేజ్ లో మొదట బిజెపి మండల పార్టీ అధ్యక్షుడే గొడవ చేస్తున్నట్లుగా ఉండటం గమనించవచ్చు.