రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్మల్ జిల్లాలో పర్యటన నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులు బుధవారం స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇందులో ఎమ్మెల్సీ దండే విట్టల్, రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్, తదితరులున్నారు.