రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తామని, ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.కె. హబీబ్ బాషా విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో పోలవరం మండలం ప్రగడపల్లి, వింజరo లోని ప్రాధమిక వ్యవసాయ సహకార సొసైటీ లో ఎరువుల పంపిణీని బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు హబీబ్ భాషా పరిశీలించారు. ఈ సందర్భంగా హబీబ్ భాషా మాట్లాడుతూ ప్రగడపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకార సొసైటీ లో మంగళవారం ఒకరోజునే 62.50 టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశారని, బుధవారం ఉదయం 39 టన్నుల ఎరువులు నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు.