విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్,అభినవ్ కోరారు. విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాత శుక్రవారం జన్నారం మండలకేంద్రనికి చేరుకుంది. ఈ సంధర్భంగా వారు స్థానిక ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యారంగంలో ఉన్న పెండింగ్ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారికి సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.