జిల్లాలో యూరియా కొరత లేదని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.యూరియా పంపిణీ కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు కావాలనే యూరియా కొరతపై అపోహలు సృష్టిస్తున్నారన్నారు. విజయవాడలో డయేరియా నియంత్రణకు కలెక్టర్ పర్యవేక్షణలో చర్యలు తీసుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.