సంతెకూడ్లూరు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాలని కుల వివక్ష పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కమిటీ జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాషను కోరింది.సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఆనంద్ బాబు, జిల్లా సహాయ కార్యదర్శులు బి. తిక్కప్ప, ఎం. భాస్కర్, సంతెకూడ్లూరు గ్రామ అధ్యక్షుడు రాము, గ్రామ నాయకుడు ఈరన్న తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మూడు సంవత్సరాల క్రితం సంతెకూడ్లూరులో కొనసాగిన అంటరానితనాన్ని అంబేద్కర్ స్ఫూర్తితో యువక