మత సామరస్యానికి నెలవైన విజయనగరంలో అతి పెద్ద క్రైస్తవ సమాజంగా పేరెన్నికగన్న సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ 150 వసంతాల వేడుకలు నేటి నుంచి ప్రారంభమౌతాయని సిమ్స్ చర్చ్ సంఘమిత్ర డా. ఆర్ ఎస్ జాన్ వెల్లడి చేశారు. మంగళ వారం 5pm సిమ్స్ చర్చ్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వేడుకల వివరాలను తెలిపారు.ఎంతో చారిత్రక నేపధ్యం కలిగిన విజయనగరం సిమ్స్ చర్చ్ కెనడా మేరీ టైం బాప్టిస్టు మహా సభకు చెందిన డాక్టర్ సేన్ ఫోర్డ్ భీమిలి నుంచి ఇక్కడకు విచ్చేసి 1875 నవంబర్ 19-22 తేదీల్లో ఇక్కడ సంఘాన్ని స్తాపించి 50 ఏళ్ళు పాటు క్రైస్తవ ఆధ్యాత్మిక సేవలతో పాటు విద్యాభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు.