బందరులో పైశాచిక దాడికి గురై గాయపడ్డా హోంగార్డు రాంమోహన్ రావును పరామర్శించిన DVMC మెంబర్ గుమ్మడి విద్యాసాగర్ డ్యూటీలో ఉన్న హోంగార్డుపై జనసేన పార్టీకి చెందిన కర్రీ మహేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో చేసిన పైశాచిక దాడిలో గాయపడి, మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సీ కులానికి చెందిన హోంగార్డు గుజ్జు మోహన్ రావు ను డీవీఎంసీ మెంబర్ గుమ్మడి విద్యాసాగర్ మంగళవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో పరామర్శించారు. మోహన్ రావు ఆరోగ్య పరిస్థితిపై అయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు.