యాదాద్రి భువనగిరి జిల్లా: అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని బిజెపి బీబీనగర్ మండల అధ్యక్షులు సదానందం గౌడ్ శుక్రవారం డిమాండ్ చేశారు. శుక్రవారం బీబీనగర్ మండలం కొండమడుగులో నిర్మించిన ఇండ్లను ఆయన పరిశీలించారు .ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన పంపిణీ చేయకపోవడంతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.