ఇందిరమ్మ ఇళ్ల లబ్ధితో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఏటూరునాగారం కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు అన్నారు. శుక్రవారం సాయంత్రం రామన్నగూడెం, రాంనగర్, కోయగూడా ఎల్లాపూర్ గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించామన్నారు. రఘు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. నాయకులు లాలయ్య, ఎల్లయ్య, బాలరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.