నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన ఐటీబీపీ కానిస్టేబుల్ నరేంద్రనాథ్ (32) విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తూ వ్యక్తిగత సమస్యలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరుకుంది. ఆయన మృతదేహం వద్ద ఐటీబీపీ పోలీసులు నివాళులర్పించారు. అనంతరం పోలీసుల లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు.