మాదాపూర్ లో ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ యజమాని సత్యప్రకాశను అమ్మాయిలు తమ తల్లిదండ్రులతో కలిసి శనివారం మధ్యాహ్నం చితకబాదారు. అమ్మాయిలు తెలిపిన వివరాల ప్రకారం సత్య ప్రకాష్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తమ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో తల్లిదండ్రులు వచ్చి అతడిని చితకబాదరని తెలిపారు. ఘటన స్థలానికి స్థానికుల సమాచారం మేరకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.