శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మీడియాతో తెలిపారు. ప్రధానంగా వరదలు వచ్చే మండలాలైన కొత్తూరు, మందస, సోంపేట ప్రాంతాల పరిధిలో అధిక వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అన్ని విద్యాలయాలకు సెలవ ప్రకటించామని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని పిలుపునిచ్చారు..