కడప జిల్లా కమలాపురం పట్టణానికి చెందిన మన ఊరు సేవా సమితికి ఆదివారం రాష్ట్ర స్థాయి సేవారత్న అవార్డు లభించింది. కడప నగరంలోని శ్రీహరి రెడ్డి కళాశాలలో ప్రజాసంకల్ప వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ విభాగాలలో సేవలు అందించిన సంస్థలకు ఈ అవార్డులు అందజేశారు.ఈ సందర్బంగా మన ఊరు సేవా సమితి అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు, ప్రజా సంకల్ప వేదిక జాతీయ అధ్యక్షుడు రంగ సాయిరెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.