నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హిమాన్షు శుక్లా శనివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి పంచకట్టులో కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు జాయింట్ కలెక్టర్ కార్తీక్, కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు.