ఈనెల 27వ తేదీన గణేష్ చవితి పండుగ ఉన్న నేపథ్యంలో పోలీసులు గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ మహేష్ బాబాసాహెబ్ గితే IPS ఆదేశాల మేరకు ఇల్లంతా కుంట మండల కేంద్రంలో సిరిసిల్ల రూరల్ సీఐ శ్రీ మొగిలి ఆధ్వర్యంలో రానున్న వినాయక చవితి పండుగ నేపథ్యంలో గణేష్ మండ పాల నిర్వాహకులతో శుక్రవారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించి పండుగను ప్రశాంతంగా ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని సూచించారు. మండపాల వద్ద సేఫ్టీ మెథడ్స్ పాటించాలని కోరారు.