బందరు కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో 139 అర్జీలను ప్రజల నుండి స్వీకరించిన జిల్లా కలెక్టర్ డికె బాలాజీ సోమవారం ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం రెండు గంటల వరకు స్తానిక మచిలీపట్నం కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను ఎంతో ఓపికగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులను పిలిపించి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. పలు శాఖల అధికారులు గైర్హాజరైనట్టు గుర్తించిన కలెక్టర్ వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీఆర్డీను ఆదేశించారు. ఆ ప్రకారం నెడు కలెక్టరేట్లో మొత్తం 139 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు.