పొదలకూరు మండలం, మొగళ్లూరు, నావూరుపల్లి, తాటిపర్తి, మహమ్మదాపురం గ్రామాల్లో మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో పక్షపాత వైఖరి ప్రదర్శిస్తే ఊరుకోమని అయన హెచ్చరించారు. తెలుగుదేశం నాయకులు సంక్షేమ పథకాలను చంద్రబాబు జేబులో నుండి ఖర్చు చేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నావూరుపల్లి గ్రామానికి చెందిన చొప్ప రాజమ్మ పెన్షన్ నిలిపివేయడం దారుణం అని గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కాకాని అన్నారు.