గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఏటూరునాగారం ASP శివం ఉపాధ్యాయ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్లో ఉత్సవ కమిటీ, ముస్లిం కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు లోబడి భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. మండపాల వద్ద ఇద్దరు కమిటీ సభ్యులు విధిగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగొద్దన్నారు.