సమాజానికి సేవ చేస్తున్న హమాలీ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వైఖరి విడనాడి సమగ్ర కార్మిక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు భీమవరం బజార్ లాగుడు బండ్ల ముఠా కార్మిక సంఘం 29వ మహాసభ భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు యూనియన్ అధ్యక్షులు కే వెంకటేశ్వరరావు అధ్యక్షతన సభ జరిగింది ఈ సభలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యులు బి. బలరాం మాట్లాడారు పాలకులు మారుతున్నా అమాలి కార్మికుల బ్రతుకుల్లో వెలుగులు లేవని అన్నారు.