ఆర్థిక లావాదేవీల కారణంగా అక్కను హత్య చేసిన తమ్ముడిని అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామానికి చెందిన దాచర్ల పోలమ్మ పింఛన్ కోసం గ్రామానికి వచ్చింది. ఆమె తమ్ముడు లచ్చయ్య దాచిన డబ్బుల్లో లక్ష రూపాయలు పోలమ్మ తీసుకుందనే అనుమానంతో గొడవపడ్డాడు. ఆవేశంతో ఆమెను మంచం కోడుతో కొట్టి చంపాడు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.