డీసీసీబీ ద్వారా గృహ నిర్మాణాలకు రుణాలివ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ ఛైర్మన్ కోన తాతారావు చెప్పారు. ఆనందపురంలో ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్రాంచు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. సహకార సంఘాల ద్వారా వ్యవసాయ అనుబంధ విభాగాలకు మాత్రమే రుణాలు అందిస్తున్నామని, రూ.40 లక్షల వరకు గృహ నిర్మాణాలకు రుణాలిస్తామన్నారు. స్వల్పకాలిక రుణపరిమితిని రూ.10 లక్షలు చేస్తామన్నారు.