గణేష్ విగ్రహాల నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అపశృతులు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, మంగళవారం సాయంత్రం విజయనగరంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. సంబంధిత పోలీస్ అధికారులు ఉత్సవ కమిటీలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ఉత్సవాలు నిమజ్జన ఊరేగింపులో డీజేలు వినియోగించడానికి అనుమతి లేదన్నారు. గణేష్ నిమజ్జనం చేసే చెరువులు నదుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు.