Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 1, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం, కరటంపాడు వద్ద నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి మృతిచెందగా, మహిళకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.