మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న గురుపూజోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శుక్రవారం నరసన్నపేట ఎంపీడీవో సమావేశం మందిరంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారి సేవలను అభివర్ణించారు.