బాలిక విద్యపై శ్రద్ధ వహించినప్పుడే బాల్య వివాహాలను నివారించవచ్చని కొవ్వూరు సెకండ్ క్లాస్ నాగలక్ష్మి అన్నారు. శనివారం కొవ్వూరు సంస్కృత పాఠశాలలో బాల్య వివాహాలపై నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ, బాల్య వివాహాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరించారు. బాల్య వివాహాల నివారణ దిశగా అందరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.