నిర్మల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం టీజీవీపీ నాయకులు డీఈఓ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ కొట్టురి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. విన్నర్ పాఠశాలలపై డీఈఓ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సమయపాలన పాటించడం లేదంటూ గతంలో మూడు సార్లు వినతులు అందజేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.