రక్తదానంతో ప్రాణాలు నిలపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. నిరంతరం సమాజం కోసం పాటుపడే బ్రహ్మకుమారీస్ ప్రకాశమని దాది 18వ దివసం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. రక్తదానంపై అపోహలు వీడి ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి అండగా నిలవాలని అన్నారు. 18 సంవత్సరాలు పూర్తయిన యువతి, యువకులు ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.