పిల్లల ఉజ్వల భవిష్యత్ కు మార్గదర్శకులు గురువు లేనని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. నాలుగు రోజుల పాటు జరగనున్న గురుపూజోత్సవ (ఉపాధ్యాయ దినోత్సవం) వేడుకల బ్రోచర్ ను భీమవరంలో ఎమ్మెల్యే రామాంజనేయులు సోమవారం సాయంకాలం 6 గంటలకు ఆవిష్కరించి మాట్లాడారు. రేపటి నుంచి 5 వ వరకు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను 18 పాఠశాలలో నిర్వహిస్తున్నామని కార్యక్రమ నిర్వాహకులు రంగసాయి, రాజేశ్ తెలిపారు. 5వ తేదీన 32 మంది ఉపాధ్యాయులను సత్కరిస్తామన్నారు.