తాడిపత్రి లోని సంజీవనగర్ లో వెలసి ఉన్న శివ సాయి మందిరంలో గురువారం రాత్రి వేద పండితులు షిరిడీలో మాదిరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు హారతులు, అభిషేకాలు, పల్లకీ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. భక్తులుకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు ఎస్ వీ రవీంద్ర రెడ్డి, శివ సాయి భక్తులు పాల్గొన్నారు.