ములుగు జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రం నుండి బాలిక పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫాక్సో కేస్ బాధితురాలైన బాలిక గత నెల 11 వ తేదీ నుండి సఖి కేంద్రంలో వసతి పొందుతుంది. మొన్న మంగళవారం రోజున రాత్రి కాంపౌండ్ వాల్ ఎక్కి పారిపోయినట్లుగా సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విధుల్లో ఉన్న లీగల్ కౌన్సిలర్, మల్టీపర్పస్ వర్కర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.