పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామంలో తెలంగాణ మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఉదయం సీజ్ చేశారు. పక్కా సమాచారంతో మాదిపాడు గ్రామంలోని ఒక ఇంట్లో దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన తెలంగాణ మద్యం 40 కేసులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మద్యం విలువ సుమారు రూ. 4 లక్షలు ఉండొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు.