కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గురువారం కడప వైసిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతుందన్నారు. దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబని,లక్షల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్న ఏకైక సీఎం చంద్రబాబు అన్నారు.బ్రిటిష్ పాలన కంటే దారుణమైన పాలన రాష్ట్రంలో సాగుతుందన్నారు.పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మాజీ సీఎం జగన్ గొప్ప ఆలోచన చేశారన్నారు.మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణమని తెలిపారు.