మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలోని పటేల్ చెరువులో మృతదేహం లభ్యం అయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నీటి నుండి బయటకు తీసి మృతుడు అప్పాజీ పల్లి గ్రామానికి చెందిన బి పేట రాములుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు