సంగారెడ్డిలో మంగళవారం ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. వీటిని నిలిపివేయడం సరికాదని, దీనివల్ల చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు