గంట్యాడ మండలం కొండతామరాపల్లి జంక్షన్ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డుపై నడిచి వెళుతున్న దివ్యాంగుడ్ని గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు మృతుడు గంట్యాడ మండలం గింజేరు గ్రామానికి చెందిన చప్ప గౌరీ నాయుడుగా గుర్తించారు. దివ్యాంగుడు గౌరి నాయుడు కొనతంరపల్లి జంక్షన్ నుంచి గింజేరు గ్రామానికి నడిచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.