వికారాబాద్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని జిల్లా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడుకిరణ్,జిల్లా కార్యదర్శి అక్బర్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఎండకు ఎండతు వానకు తడుస్తూ విద్యాభ్యాసం చేయాల్సిన పరిస్థితి నెలకొందని వెంటనే సుమారుగా 600 మంది విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భవనాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.