*వి ఆర్ హాస్పిటల్ యజమాన్యం పై కఠినమైన క్రిమినల్ కేసులను పెట్టాలని, హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలని సిపిఎం డిమాండ్.* వి ఆర్ హాస్పిటల్ యజమాన్యంపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వి ఆర్ హాస్పిటల్ ఎదుట ధర్నా కార్యక్రమం మహబూబ్ బాషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సి పి ఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు యస్ ఎం డి షరీఫ్ లు మాట్లాడుతూ నంద్యాల జిల్లా మిడుతూరు మండలం అలగనూరు నివాసి అయినటువంటి రజియా తన కు అపెండిక్స్ వ్యాధితో గత సోమవారం హాస్పిటల్ నందు చేరినారు. డాక్టర్లు అన్ని రకాల కండిషన్లన