మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ గణేష్ నగర్ లో బంగారు మైసమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సోమవారం మధ్యాహ్నం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్ధి బుద్ధి జ్ఞానం ప్రసాదించే గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గణనాథుడిని నియమనిష్టలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు.