నందిగామ మండలం మునగచర్ల గ్రామంలోని ఓ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు షాపులో నుంచి రూ.1.50 లక్షల నగదును దొంగలించినట్లు యజమాని వెంకట్రావు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.