దేశంలో డాక్టర్ల సంఖ్యను పెంచాలని.. నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ లను ఏర్పాటు చేయాలని ప్రజా ఆరోగ్య వేదిక నేత రమణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకి నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల నిర్మాణాలలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విధానాన్ని కొనసాగిస్తే ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం ఎక్కువ అవుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు