పల్నాడు జిల్లాలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం త్వరలో పర్యటిస్తుందని టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టడం సరైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.