ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదివారం ఉదయం పంపిణీ చేశారు.కలికిరి మండలం నగిరిపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ రకాల ప్రమాదాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న 8మంది బాధితులు ఎమ్మెల్యే సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకొన్నారు. వీరికి సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన 10,50,307 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చేతులమీదుగా వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు.