విజిలెన్స్ డిజి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు శ్రీకాకుళం ప్రాంతీయ నిఘా మరియు అమలు విభాగం ఎస్పీ బర్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు బుధవారం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేపట్టిన పనుల నాణ్యతా పరిశీలనలో భాగంగా సీతంపేట మండలం పరిధిలో గొయ్యిగూడ - జోడుమానుగూడ రోడ్డు, నారాయణవలస - గదబవలస రోడ్డు, బొంగుడుగూడ - బుగతగూడ రోడ్డు, ఎగువశంకి - దిగువసంకి సంబంధించి సిమెంట్ రోడ్ల నాణ్యత నిర్ధారణ కొరకు కాంక్రీటు నమూనాలను ల్యాబ్ పరీక్షల నిమిత్తం సేకరించటం జరిగింది. పనుల పరిశీలనకు విచ్చేసిన ఎస్పీ ఫలితాల ఆధారంగా నాణ్యతకు సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.